24 July, 2026 | 7:21 AM

యూటీల్లో మిశ్రమ ఫలితాలు

05-06-2024 02:57 AM

ఢిల్లీ మినహా కేంద్ర పాలిత ప్రాంతా ల్లో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. జమ్ముకశ్మీర్‌లోని మొత్తం 5 స్థానాల్లో బీజేపీ, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు చెరో రెండు స్థానాల్లో విజయం సాధించాయి. మరో స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. ఒక్క స్థానాలున్న కేంద్ర పాలిత ప్రాంతాలు లద్ధాఖ్‌లో స్వతంత్ర అభ్యర్థి, ఛండీగఢ్‌లో కాంగ్రెస్, అండమాన్ నికోబార్‌లో బీజేపీ, లక్షద్వీప్‌లో కాంగ్రెస్, పుదుచ్చేరిలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. రెండు స్థానాలున్న దాద్రానగర్ హవేలీలో ఒకటి బీజేపీ గెలుచుకోగా మరొదాన్ని స్వతంత్ర అభ్యర్థి కైవసం చేసుకున్నారు.  నిజానికి ఈ కేంద్రపాలిత ప్రాంతాలను ఇండియా కూటమి పెద్దగా సీరియస్‌గా తీసుకోలేదు. ఎన్డీయే మాత్రం ఒక్క సీటు కూడా ముఖ్యమే అని భావించిన ప్రచారం చేసింది. స్వయంగా ప్రధాని కూడా పలుసార్లు పర్యటించి ప్రచారం నిర్వహించారు.