22 August, 2026 | 1:50 AM

జీవో 97 రద్దు చేయాలని బీజేవైఎం నిరసన

22-08-2026 12:00 AM

మీర్ పేట్, అగస్టు 21(విజయక్రాంతి): మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్ పేట్ పరిధి లో టికేర్ కాలేజ్ ఆవరణలో రిజెక్ట్ శక్తి స్కీమ్  సేవ్ పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్ నినాదాలతో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల లక్షల మంది పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తు గందరగోళంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే పునర్ ఆలోచన చేసి జీవో నెంబర్ 97రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేవైఎం కార్యవర్గ సభ్యుడు చింతల రాఘవేందర్, నితిన్ పోరెడ్డి, దాసి పవన్, జేడీ పవన్, హరేకృష్ణ, గుర్రం సాత్విక్ తదితరులు పాల్గొన్నారు.