22 August, 2026 | 2:40 AM

మాగనూరు మండలంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

22-08-2026 01:50 AM

మాగనూరు ఆగస్టు 21:  ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ  శుక్రవారం మండలంలోని మాగనూరు,అడవి సత్కారం, కొల్పూరు, మందిపల్లి, అమ్మపల్లి గ్రామాలలో స్మార్ట్ కార్డుల పంపిణీ చేయడం జరిగిందని మాగనూరు మండల కాంగ్రెస్ అధ్యక్షులు శివరాం రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆనంద్ గౌడ్ తెలిపారు.

నిరుపేద కుటుంబాల సభ్యులు పస్తులు ఉండకుండా  ప్రభుత్వం ప్రతి వ్యక్తికి ఆరు కిలోల బియ్యం ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ రహమతు, ఆర్ ఐ సుధాకర్ రెడ్డి, సర్పంచులు ముద్దు రాములు, ఆనందమ్మ, నరసింహులు, జనార్ధన మ్మ, రఘునాథ్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ శంకర్ లింగం, జయనంద రెడ్డి,కాంగ్రెస్ నాయకులు లబ్ధిదారులు  తదితరులు పాల్గొన్నారు.