మాడిపోయిన అన్నం, నీళ్ల సాంబారు తినలేకపోతున్నాం..
- మా గోడు పట్టించుకోండి సారూ.!
- నేరేడ్‌మెట్‌లోని మండల ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనంపై విద్యార్థుల ఆవేదన
మల్కాజిగిరి, ఆగస్టు 21,(విజయ క్రాంతి ): నేరేడ్ మెట్ మండల ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడ సరైన భోజనం పెట్టక పోవడంతో సగం మంది విద్యార్థులు ఇంటి బాట పట్టిన పట్టించుకునే వారు లేరు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం అమలు చేస్తూ, పాఠశాలల బలోపేతానికి ఒక వైపు కృషి చేస్తూ ఉంటే, మరోవైపు ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వల్ల విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్నం భోజనం అందక పస్తులు ఉండే పరిస్థితి ఏర్పడింది. కొంత మంది విద్యార్థులు ఇంటి నుండి భోజనాలను టిఫిన్ బాక్సులలో తెచ్చుకుని భోజనాలు చేస్తున్నామని వాపోతు న్నారు.
ఈ పాఠశాలలో మాడిపోయిన అన్నం, నీళ్ల సాంబారు అంద జేస్తున్నారని ఇది తినాలంటే మాకు ఇబ్బందిగా ఉందని పిల్లలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ గోడు ఎవరికి చెప్పాలో అర్థం కాక పెట్టింది తినుకుండా ఉంటున్నామని వాపోయారు. మేం వండినది...పెట్టింది తినండి.లేకపోతే మీ ఇష్టం అని ఈ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వంట చేసే వాళ్ళ తీరు ఇలా ఉంది. మధ్యాహ్నం భోజనం పట్ల అటు భోజనం వండే నిర్వాహకులు నిర్లక్ష్యం వహిస్తుండగా, ఇటు ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా నిర్లక్ష్యం వహించడంతో చాలామంది విద్యార్థులు తమకు సరైన పౌష్టికాహారం అందించడం లేదని లబోదిబోమంటున్నా రు.
ఇకనైనా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ , ఉన్నత అధికారులు స్పందించి ఈప్ర భుత్వ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి, నాసిరకం మధ్యాహ్నం భోజనం అందజేస్తు న్న వారిని తొలగించి, వారి స్థానంలో కొత్త వారిని నియమించాలని విద్యార్థి సంఘం నాయకులు కోరుతున్నారు. విద్యార్థు లకు నాణ్యమైన పౌష్టికాహా రాన్ని అందించేలా తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.






