కష్టపడే వారికి కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది
రామగిరిలో సంబరాలలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్..
రామగిరి (విజయక్రాంతి): కష్టపడే వారికి కాంగ్రెస్ పార్టీ గుర్తించి గౌరవిస్తుందని మంత్రి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్(Congress Party President Thotla Tirupati Yadav) అన్నారు. జాతీయ కాంగ్రెస్ పార్టీ దుద్దిళ్ల శ్రీను బాబు(Duddilla Srinu Babu)ను గుర్తించి, రాష్ట్ర పీసీసీ ప్రధాన కార్యదర్శి నియమించడం అందుకు నిదర్శనం అని ఆయన అన్నారు. రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సోదరుడు శ్రీను బాబును టిపిసిసి ప్రధాన కార్యదర్శి గా నియామకం ఆయన సందర్భంగా రామగిరి మండలంలోని సెంటినరీ కాలనీలోని ఐఎన్ టియూసి భవనంలో రామగిరి మండల అధ్యక్షులు రోడ్డ బాపన్న ఆధ్వర్యంలో స్వీట్లు పంపిణీ చేసి బాణాసంచా కాల్చి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రామగిరి మండల అన్ని విభాగాల అధ్యక్షులు, పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






