31-12-2025 08:11:54 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ప్రజలందరికీ, జిల్లా అధికార యంత్రాంగానికి జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరం 2026 జిల్లా ప్రజల జీవితాల్లో శాంతి, సుఖసంతోషాలు, ఆరోగ్యం, అభివృద్ధిని తీసుకురావాలని ఆకాంక్షించారు. గత ఏడాదిలో జిల్లాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలులో అధికారులు అంకితభావంతో పనిచేశారని ప్రశంసించారు. ప్రజల సహకారం, అధికారుల సమన్వయంతో జిల్లా వ్యవసాయం, విద్య, వైద్యం, మౌలిక వసతులు, సంక్షేమ రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించిందని తెలిపారు.
రాబోయే సంవత్సరంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి పూర్తిస్థాయిలో అందేలా అధికారులు మరింత బాధ్యతతో పనిచేయాలని సూచించారు. అలాగే ప్రజలు కూడా ప్రభుత్వ కార్యక్రమాలకు సహకరించి, జిల్లాను అన్ని రంగాల్లో ముందువరుసలో నిలిపేలా భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు. నూతన సంవత్సరం సందర్భంగా జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, 2026 సంవత్సరం జిల్లాకు మరింత అభివృద్ధి, సమృద్ధిని తీసుకురావాలని కలెక్టర్ ఆకాంక్షించారు.