11-12-2025 12:58:51 AM
అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ
నాగర్కర్నూల్, డిసెంబర్ 10 (విజయక్రాంతి): గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీలతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలను అచ్చంపేట ఎమ్మెల్యే, నాగర్కర్నూల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు చిక్కుడు వంశీకృష్ణ పిలుపు నిచ్చారు. తనను మూడోసారి డీసీసీ అధ్యక్షుడిగా నియమించిన పార్టీ అధినాయకత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
బుధవారం నాగర్కర్నూల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులు, వార్డు సభ్యుల గెలుపు కోసం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త క్షేత్రస్థాయిలో నిరంతరంగా పనిచేయాలన్నారు.
కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తే స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సమన్వయంతో గ్రామాల అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు. ఈ సమావేశంలో మాజీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.