11-12-2025 12:57:33 AM
ఎన్నికల అధికారులు సామగ్రిని సరిచూసుకోవాలి
ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలను పరిశీలించి మాట్లాడిన జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్, ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్
కల్వకుర్తి టౌన్ డిసెంబర్ 10 : గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నిర్వహించాలని నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్, ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ అన్నారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ సామాగ్రి పంపిణీ కేంద్రాన్నీ పరిశీలించి, ఎన్నికల సిబ్బందికి సామాగ్రి అందజేసి వారు మాట్లాడారు.
పోలింగ్ కేంద్రాలకు వెళ్లే సిబ్బంది బ్యాలెట్ పేపర్లను ఇతర సామాగ్రిని సరిచూసుకోవాలని, విధులకు హాజరయ్యారు ప్రతి ఒక్కరూ తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు తప్పనిసరిగా చేరుకోవాలని, సామగ్రిని ఒకటికి రెండుసార్లు సరిచూసుకొవాలని వివరించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలకు పోలీసులు వెళ్లి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల్లో సమస్యలు ఎత్తలేదు వెంటనే పై స్థాయి అధికారులకు తెలియజేయాలని వారు సూచించారు. కార్యక్రమంలో ఆయా శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.