1 August, 2026 | 1:23 AM

సర్ ప్రక్రియను పూర్తి.. బీఎల్‌ఓకు సన్మానం

01-08-2026 12:20 AM

కందుకూరు, జూలై 31(విజయక్రాంతి): సర్ ప్రక్రియలో భాగంగా కందుకూరు మండల పరిధిలోని మాదాపూర్ గ్రామంలో బిఎల్‌ఓ కవిత శ్రద్ద వహించి బూత్ నంబర్ 528లో 100% పూర్తి చేయడంతో ఆ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఆమెను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా గ్రామ శాఖ అధ్యక్షులు ఆదిమూలం శ్రీకాంత్ మాట్లాడుతూ,తమ గ్రామంలో ఎస్‌ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేసి 100% పూర్తి చేసిన బిఎల్‌ఓ కవితను తాము అందరము అభినందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఈ ప్రక్రియలో గ్రామస్తులు పూర్తిస్థాయిలో తమ ఓటు హక్కును కల్పించుకోవడానికి పూర్తిస్థాయిలో మద్దతు తెలిపి ఫారాలు అందించడం అభినందనీయమని ఆయన తెలిపారు.ఇలాంటి కార్యక్రమాల్లో ప్రజలు సమయం తీసుకొని పూర్తి స్థాయిలో సహకరించినందుకు గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలియజేసినట్లు ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వంగపల్లి అనిల్,యేర జగన్, తిరుమలరెడ్డి, అరిగే నరేందర్, కృష్ణ, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.