1 August, 2026 | 2:03 AM

ప్రాజెక్టుల్లోకి జోరుగా వరద

01-08-2026 01:23 AM

పొంగుతున్న వాగులు, నిండుతున్న చెరువులు, కుంటలు 

కామారెడ్డి పెద్ద చెరువు అలుగు మత్తడి దుంకుతున్న వైనం 

కామారెడ్డి, జూలై 31 (విజయక్రాంతి): గతం మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు తో ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టుల్లోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతుంది. నిజామాబాద్ జిల్లా శ్రీ రామ్ సాగర్ ప్రాజెక్టులోకి 75 క్యూసెక్కుల  వరద నీరు వచ్చి చేరుతుంది.

కామారెడ్డి జిల్లాలోని సింగీతం ప్రాజెక్టు నిండడంతో మూడు గేట్లను అధికారులు ఎత్తారు. నిజాం  సాగర్ ప్రాజెక్టు లోకి భారీ వద్ద నీరు వచ్చి చేరుతుంది. కౌలస్నాల ప్రాజెక్టు,  లకు భారీ వరద నీరు చేరుతుంది. కామారెడ్డి జిల్లాలోని భీమేశ్వర వాగు, దోమకొండలోని గొట్టిముక్కుల వాగు, లింగంపేట వాగు, గాంధారి వాగులు జోరుగా ప్రవహిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో చెరువులు నిండి అలుగులు పారెందుకు సిద్ధమయ్యాయి. కామారెడ్డి పెద్ద చెరువు శుక్రవారం అలుగు పారుతుంది.

చెరువులు కుంటల్లో వరద నీరు  వచ్చి చేరుతుండడంతో నిండుకుండలా మారుతున్నాయి. చిన్న చిన్న వాగులు రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. శిథిలావస్థలో ఉన్న ఇండ్లు కూలుతున్నాయి. పంట పొలాలు నీట మునిగి రైతులకు ఇబ్బందులు కలుగుతున్నాయి. ఎడతెరిపి లేని వర్షం తో ఉమ్మడి జిల్లాల్లో జలకళ సంతరించుకోవడమే కాకుండా చెరువులు, కుంటలు నిండి నీటి కుండల  మారాయి. రైతులు, ప్రజలు జోరుగా వర్షాలతో ఊరట చెందారు. మెట్ట భూముల్లో వేసిన పంటలు మొక్కజొన్న, సోయా, పత్తి, పంటలతో పాటు కూరగాయల పంటలు కు ఈ వర్షం ఎంత ఊరట ఇచ్చింది. బోరు బావుల వద్ద వేసిన వరి నారు తో రైతులు జోరుగా నాట్లు వేస్తున్నారు.

ఎస్సారెస్పీలోకి భారీ వరద 75 క్యూసెక్కుల ఇన్ ఫ్లో

అర్మూర్, జులై 23 (విజయ క్రాంతి) : రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలక శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి  ఎగువ ప్రాంతం నుంచి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. మహారాష్ట్రలో,  ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలకు ఈ వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టులోకి  క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది.

శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులకు 80.5 టిఎంసిలగాను ప్రస్తుతం ప్రాజెక్టులో 1067.00 అడుగులకు 18.71 టీఎంసీల నీరు నిలువ ఉంది. గత ఏడాది ఇదే రోజున 1077.10 గాను 38.79 టిఎంసిల నీరు నిలువ ఉండింది. ఉదయం  ఆరు వేల క్యూసెక్కుల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు సుమారు 80వేల క్యూసెక్కుల వరకు వరద క్రమ క్రమంగా పెరుగుతూ వచ్చింది.

ఎనిమిది గంటలకు తొమ్మిది వేల క్యూసెక్కులు, 10 గంటలకు10 వేలు, 12 గంటలకు 13 వేలు, మధ్యాహ్నం రెండు గంటలకు 20 వేల క్యూసెక్కుల వరద పెరుగుతూ వచ్చింది. నాలుగు గంటలకు 35 వేల క్యూసెక్కులు, నాలుగు గంటలకు 48 వేల క్యూసెక్కులు, ఆరు గంటలకు 72 వేల క్యూసెక్కులు, ఏడు గంటలకు 70 వేల క్యూసెక్కులు, ఎనిమిది గంటలకు 75వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరింది. ప్రాజెక్టు నుంచి 751 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. కాకతీయ కాలువకు 250 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 50 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు, తాగునీటి అవసరాల కోసం 108 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.

ఉధృతంగా ప్రవహిస్తున్న భీమేశ్వర వాగు 

తాడ్వాయి,జూలై, 31( విజయ క్రాంతి ): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. మండలంలోని సంతాయిపేట భీమేశ్వర వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది.వాగు పై నిర్మించిన మత్తడి పై నుంచి వాగు పొంగిపొర్లుతుండంతో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కురుస్తున్న వర్షాలకు మండలంలోని దేమి కలాన్ పెద్ద చెరువు, ఎర్రపహాడు పెద్ద చెరువు, నందివాడ, బ్రాహ్మణపల్లి, చిట్యాల, సంతాయిపేట, కృష్ణాజివాడి, కరడుపల్లి చెరువుల్లోకి వరద నీరు వచ్చి చేరుతుంది. ఎర్రపహాడు పెద్దవాగు, నందివాడ పిల్లోఒర్రె,కన్కల్ బ్రాహ్మణపల్లి, కాళోజి వాడి వాగులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. 

రైతుల్లో వెలివేసిన ఆనందం..

- - గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రైతుల్లో ఆనందం వెళ్లి విరుస్తుంది. తాము ఖరీఫ్ లో వేసుకున్న పంటలు పండుతాయో, ఎండిపోతాయో అనే ఆందోళనతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎలినినో ప్రభావం కారణంగా ఈ సంవత్సరం సరైన వర్షాలు పడకపోవడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. ఈ సంవత్సరం అసలు వర్షాలు పడతాయో లేదో అనే ఆలోచనతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఒక్కసారిగా వర్షాలు భారీగా కురుస్తుండడంతో రైతుల్లో ఆనందం పెరిగిపోయింది. ఈ ఖరీఫ్ లో వేసుకున్న తమ పంటలు కచ్చితంగా పం డుతాయని రైతులు సంబరపడుతున్నారు.