25 May, 2026 | 1:04 AM

రక్తదానం ప్రాణదానమే

25-05-2026 12:00 AM

ఎమ్మెల్యే కేపీ వివేకానంద

కుత్బుల్లాపూర్, మే 24(విజయక్రాంతి): రక్తదానం ఆపదలో ఉన్న వారికి ప్రాణదానమేనని బీఆర్‌ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. జీహెచ్‌ఎంసీ కొంపల్లి సర్కిల్ ఎన్సీఎల్ సువేల సుకేతన్ విల్లాస్‌లో లయన్స్‌క్లబ్ కొంపల్లి లైఫ్ స్పేసెస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని బీఆర్‌ఎస్ ఎల్పీవిప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారికి, తలసేమియా బాధితులకు ఎంతగానో ఉపయోగపడే ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్న లయన్స్‌క్లబ్ కొంపల్లి లైఫ్ స్పేసెస్ బృందానికి అభినందించారు. ఈ కార్యక్రమంలో కొంపల్లి మాజీ మున్సిపల్ చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్, పార్టీ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, నాయకులు ప్రవీణ్‌రావు, ఉప్పల రమేష్, విశ్వనాథరాజు, నరేందర్ రెడ్డి, మధు, లయన్స్ క్లబ్ కొంపల్లి లైవ్ స్పేసెస్ సభ్యులు చిల్లా రాము, పసుపులేటి కృష్ణమూర్తి, రాజేష్, విక్రమ్, హర హరరావు తదితరులు పాల్గొన్నారు.