25 May, 2026 | 1:04 AM

శాంతిస్థాపనకు పాటుపడాలి

25-05-2026 12:00 AM

ముషీరాబాద్, మే 24 (విజయక్రాంతి): ప్రపంచ శాంతిస్థాపనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని ప్రముఖ సామాజికవేత్త అమృత్ కుమార్ జైన్ అన్నారు. ఆదివారం బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎస్‌ఈబ్ల్యుపీఎల్ ఆధ్వర్యంలో 13వ వార్షిక ప్రపంచశాంతి స్మారక సభ జరిగింది. ఈ సందర్భంగా అమృత్ కుమార్ జైన్ మాట్లాడుతూ సమసమాజ నిర్మాణం కోసం శాంతి సందేశాన్ని విసృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. ప్రపంచశాంతి, మానవతా విలువలు పెంపొందించడానికి సమాజ సహాకారం అవసరం అన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్‌డబ్ల్యు పిఎల్ మేనేజర్ యెలిషా మతంగి, రవికుమార్, రోజారాణి, డాక్టర్ అనిత, తుమ్మ జనార్ధన్ పాల్గొన్నారు.