25 May, 2026 | 1:04 AM

మహిళ అదృశ్యం

25-05-2026 12:00 AM

మేడిపల్లి, మే 24 (విజయక్రాంతి): అపో లో ఫార్మసీలో మందులు కొనడానికి వెళ్లిన మహిళ అదృశ్యమైన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి చెంగిచర్లలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెంగిచర్ల ప్రాంతానికి చెందిన బిక్షపతినాయక్ అతని భార్య భూక్య తిరుమల (38) 21న రాత్రి 9:15 గంటల సమయంలో చెంగిచెర్లలోని అపోలో ఫార్మసీలో మందులు కొన డానికి వెళ్లి, తిరిగి ఇంటికి రాలేదు.

కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాలలో వెతికినప్పటికీ ఆమె ఆచూకీ లభించలేదు. వ్యాపార ఆర్థిక స మస్యల కారణం గా ఆమె ఇంటి నుంచి వెళ్లి ఉం డొచ్చునని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. ఈ విషయంపై మేడిపల్లి పోలీ సులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మహిళ వివరాలు తెలిస్తే  పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలన్నారు.