20 May, 2026 | 3:53 PM

Breaking News

మార్కెట్ కమిటీ చైర్మన్ ను సన్మానించిన నాయకులు   •   ఉత్పత్తి లక్ష్యాల సాధనే ధ్యేయంగా పునరంకితమవ్వాలి   •   సింగరేణిని కాపాడుకోవడమే తెలంగాణ బొగ్గుగని కార్మిక సమాఖ్య ఏకైక లక్ష్యం   •   మైనర్ బాలికను మభ్యపెట్టి వివాహం చేసుకున్న పోలీస్ కానిస్టేబుల్   •   నవోదయ ఫలితాల్లో బ్లూమింగ్ మైండ్స్ విద్యార్థుల ప్రతిభ   •   ఆన్‌లైన్ మందుల అమ్మకాలను నిలిపివేయాలి   •   మనోహర్ లాల్ ఖట్టర్‌తో మంత్రి కిషన్ రెడ్డి భేటీ.. పట్టణాభివృద్ధిపై చర్చ   •   సుప్రీంకోర్టు సీరియస్.. కులగణ పిటిషన్‌ కొట్టివేత   •   దేశవ్యాప్తంగా మెడికల్ దుకాణాలు బంద్   •   కొనసాగుతున్న ఎల్లయ్య చెరువు కాలువల పూడికతీతల పనులు   •  

సమీకృత మర్కెట్‌పై నీలి నీడలు

19-06-2024 01:29 AM
  • నిర్మల్‌లో రోడ్లపైనే వ్యాపారాలు

ప్రభుత్వ భవన ధ్వంసంతో ప్రజల్లో అసంతృప్తి

రూ.1.50 కోట్లున్నా ముందుకు సాగని పనులు

నిర్మల్, జూన్1౮(విజయక్రాంతి): నిర్మల్‌లో సమీకృత మర్కెట్ నిర్మాణంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. బీఆర్‌ఎస్ హయాం లో భవననానికి రూ.1.5 కోట్లు మంజూరు చేయగా.. గతేడాది అక్టోబర్ 4న అప్పటి మంత్రి కేటీఆర్ పనులకు శంకుస్థాపన చేశారు. నిర్మల్ పట్టణంలో నిజాం కాలంలో నిర్మించిన పాత తహసీల్దార్ కార్యాలయాన్ని కూల్చి, సుమా రు ఎకరంన్నర స్థలంలో మోడల్ మర్కెట్ భవన సముదాయాన్ని నిర్మించాలని మున్సిపల్ అధికారులు నిర్ణయించారు.

అప్పటి జిల్లా మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి సహకారంతో ఎన్నికల కోడ్‌కు ముందు పనులను కేటీఆర్‌చే హడావిడిగా ప్రారంభించారు. మట్టి, మొరం వేసి వదిలేయడంతో స్థలం మైదానాన్ని తలపిస్తుండగా.. రాత్రి వేళల్లో మందుబాబులకు అడ్డాగా మారుతున్నది. ఎన్నికల అనంతరం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం, ఇంద్రకరణ్‌రెడ్డి ఓటమి చెంది నిర్మల్ ఎమ్మెల్యేగా మహేశ్వర్‌రెడ్డి(బీజేపీ) గెలువడం తో మార్కెట్ భవన నిర్మాణా న్ని ఎవరూ పట్టించుకోవడంలేదు. కొత్త సర్కారైనా సమీకృత భవన నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రజ లు కోరుతున్నారు. 

నాలుగు ప్రాంతాలకు వెళ్లాల్సిందే...

నిర్మల్ మున్సిపాలిటీలో మొత్తం 42 వార్డులు ఉండగా 1.30 లక్షల జనాభా ఉంది. పట్టణంలోని గాంధీపార్కు, పాత పోలీస్ స్టేషన్ సమీపంలో కూరగాయాలు విక్రయిస్తుండగా.. భాగ్యనగర్ బోయవాడలో చేపలు విక్రయిస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో రోడ్లపైనే దుకాణాలు ఏర్పాటు చేసుకుని అమ్ముతున్నారు. సమీకృత మార్కె ట్ భవన సముదాయం లేకపోవడంతో వ్యాపారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

కూరగాయలు, పండ్లు, మాంసం, చేపలు కొనుగోలు చేయాలంటే నాలుగు చోట్లకు వెళ్లాల్సిందే. అవి కూడా రోడ్ల పక్కనే అమ్ముతుండడంతో దుమ్ముధూళితో ఆరో గ్యం దెబ్బతినే అవకాశముంది. వాహనాలు రోడ్ల పక్కనే నిలుపడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతున్నది. గ్రామల నుంచి వచ్చే కూరగాయల వ్యాపారులు వాటిని ఒకేచోట విక్రయించేందుకు మర్కెట్ లేకపోవడంతో పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో తిరగాల్సి వస్తున్నది.