20 May, 2026 | 2:35 PM

ముగిసిన బ్రహ్మోత్సవాలు

19-06-2024 01:32 AM

నాగర్‌కర్నూల్, జూన్ 18 (విజయక్రాంతి): నాగర్‌కర్నూల్ జిల్లా శ్రీపురం రంగనాయకస్వామి ఆలయంలో నాలుగు రోజులుగా కొనసాగిన బహ్మోత్సవాలు మంగళవారం చక్రస్నానంతో ముగిశాయి. మహాపూర్ణాహుతి అనంతరం ఆలయ ఆవరణలో ఉన్న చంద్ర పుష్కరిణిలో ఆలయ అర్చకులు పుణ్యస్నానాలు ఆచరించారు. గంగో త్రి, యమునోత్రి, అలకనంద నుంచి తెచ్చిన పవిత్ర జలాలను పుష్కరిణిలో కలిపి రంగనాథ స్వామి, గోదాదేవి చక్రస్నానం ఘట్టాన్ని జరిపించారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త రంగాచార్యులు, కమిటీ చైర్మన్ రామకృష్ణారెడ్డి, నర్సింహారెడ్డి, శ్రీధర్‌రెడ్డి, వరదయ్య తదితరులు ఉన్నారు.