బీఎంటీ, సెల్యులార్ థెరపీ సేవలు
రెనోవా బీబీ క్యాన్సర్ హాస్పిటల్స్‌లో ప్రారంభం
హైదరాబాద్, జూలై 21 (విజయక్రాంతి): రెనోవా బీబీ క్యాన్సర్ హాస్పిటల్స్‌లో బ్లడ్ క్యాన్సర్లు, తీవ్రమైన రక్త సంబంధిత వ్యాధుల చికిత్స కోసం అత్యాధునిక బోన్ మ్యారో ట్రా న్స్‌ప్లాంట్ (బీఎంటీ), సెల్యులార్ థెరపీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. డాక్టర్ ఎండీ నదీమ్ అహ్మద్ మాట్లాడుతూ బ్లడ్ క్యాన్సర్లను ప్రారంభ దశలోనే ఆధునిక చికిత్స అందిస్తే మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయన్నారు.
డాక్టర్ విషాల్ టోకా మాట్లాడుతూ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాం ట్, సెల్యులార్ థెరపీ రంగంలో వచ్చిన పురోగతితో రక్త క్యాన్సర్ల చికిత్సలో మంచి ఫలితా లు వస్తున్నాయన్నారు. డాక్టర్ సయ్యద్ అక్బర్ కోత్వాల్ మాట్లాడుతూ.. అంతర్జాతీయ ప్రమాణాల క్యాన్సర్ చికిత్సను అందుబాటు ధరల్లో అందించడమే లక్ష్యమన్నారు. ప్రొఫెసర్ మహ్మద్ మసూద్ అహ్మద్ మాట్లాడుతూ.. నిపుణులైన వైద్య బృందంతో ప్రపంచ స్థాయి క్యాన్సర్ సేవలను మరింత మందికి చేరువ చేస్తున్నామన్నారు.






