17-07-2025 12:24:19 AM
బోధన్ జులై 16 (విజయ క్రాంతి): బోధన్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి బలరాం రాజు వెల్లడించారు. బుధవారం పట్టణంలోని లయన్స్ కంటి ఆసుపత్రి ఆవరణలో మాజీ అధ్యక్షులు రవి, గంగులు అధ్యక్షతన ప్రెస్ క్లబ్ సభ్యులు సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహించారు.
ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా శ్రీనివాస్, కార్యదర్శిగా కృష్ణ, కోశాధికారిగా మహమ్మద్ అహ్మద్, ఉపాధ్యక్షులుగా లక్ష్మణ్, రాజేష్, సహాయ కార్యదర్శులు గా కారం స్వామి, సాయిలు, సభ్యులుగా గోపి, అనిల్, రాజశేజర్, సంగమేశ్వర్, మల్లేష్, అబ్బయ్య గౌరవ అధ్యక్షులు రవి, ముఖ్య సలహా దారులుగా గంగులు, బలరామరాజులను ఎన్నుకున్నారు.