calender_icon.png 17 July, 2025 | 3:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెబ్బేరుకు ఇచ్చిన హామీలను నెరవేర్చటం నాముందున్న కర్తవ్యం

17-07-2025 12:23:12 AM

వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి

 పెబ్బేరు జూలై 16 : మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో గోదాం ను, ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో 30 పడకల ఆసుపత్రికి బుధవారం ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి భూమి పూజ చేశారు. జాతీయ రహదారి 44 పక్కన ఉండటం తో అనేక ప్రమాదాలు జరిగి సరైన సమయంలో వైద్యం అందక చాలా మంది మృతి చెందారు.

ఇదే విషయం పై గత సర్పంచ్ అక్కి సుశీలా శ్రీనివాస్ ఎంతమంది మంతృలను కలిసి వినతిపత్రం ఇచ్చినప్పటికీ ఫలితం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తక్షణమే 30 పడకల ఆసుపత్రి మంజూరు అయింది. ఎమ్మెల్యే కు వారితో పాటు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి మాట్లాడుతూ పెబ్బేరు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చటం ప్రస్తుతం నాముందున్న కర్తవ్యం అని అన్నారు.

రెవిన్యూ డివిజన్ తో పాటు, సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం కూడా తీసుకుని వస్తా అని అన్నారు. పెబ్బేరు ప్రజలకు జీవనాధారం అయిన సంత వివాదానికి త్వరలో ఫుల్ స్టాప్ పెడతానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి వద్ద సంత ఫైల్ ఉందని, త్వరలో అది ప్రజలకు అనుకూలంగా రాబోతున్నదని తెలిపారు. అభివృద్ధి కోసం పూర్తి స్థాయిలో నేను కట్టుబడి ఉన్నానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ఆలే శ్రీనివాస్, మార్కెట్ యా ర్డ్ ఛైర్ పర్సన్ ప్రమోదిని రెడ్డి, వైస్ చైర్మన్ విజయ వర్దన్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అక్కి శ్రీనివాస్ గౌడ్, రంజిత్ కుమార్, వెంకటేష్ సాగర్, సురేంద్ర గౌడు, మల్లేష్ యాదవ్, రవి నా యుడు, కారుపాకుల వెంకట్రాములు, మంద అక్కమ్మ, నర్సింహ నాయుడు, కరుణాకర్ గౌడ్, తాటిపాముల వెంకటయ్య, మహ్మద్ షకీల్, బాపన్ పల్లి రమేష్, తదితరులు పాల్గొన్నారు.