17-07-2025 12:24:55 AM
అయిజ జూలై 16. ఆర్గనైజర్ల కంపెనీల దోపిడిని దౌర్జన్యాన్ని ఎండగడుతూ ఐజ మండలం బింగు దొడ్డి గ్రామంలో ఉదయము ఏడు గంటల నుండి 12:30 వరకు సుమారు ఐదు గంటల పాటు వందల మంది రైతులు రాస్తారోకో నిర్వహించారు. రాస్తారోకో చేయ డం వల్ల పలు వాహనాలు ఎక్కడి అ క్కడే నిలిచి పోయాయి.
రైతుల నీరసనకు స్థానిక బి ఆర్ ఎస్ రాష్ట్ర నా యకులు వెంకట్ రాములు మద్దతు తెలుపుతూ మాట్లాడారు. పువ్వు పు వ్వు రుద్దే పంటను తొలగించమని గత 15 రోజులుగా రైతులను ఆర్గనైజర్లు కంపెనీలు ఒత్తిడి చేస్తున్నా యని ఇప్పటికే ఫౌండేషన్ సీ డును ఇచ్చి నా ఆర్గనైజర్లు సీడ్ కంపెనీలు రైతులతో పంట వేయించి ముగ్గదశకు చేరుకున్న తర్వా త పంటను పీకి వేయమనడం తొలగించమనడం ఎంతవరకు సమం జసమన్నారు.
ఇప్పటికే ప్రతి ఎకరాపై రైతులు రూ లక్ష రూపాయల పెట్టుబడి పెట్టారని, అదనంగా మరో లక్ష పెట్టవల సి వస్తుందని గతంలో ఈ పంటను ఐదు క్వింటాల్ వచ్చినా 6 క్విం టాల్ వచ్చిన కొనేవారన్నారు. రైతులు రోడ్ ఎక్కే విధంగా పూనుకున్న ఆర్గనైజర్లపై కంపెనీలపై పిడి యాక్ట్ నమోదు చేయాలని లేకపోతే రేపు జరగబోయే కలెక్టర్ ఆఫీసులో సమావేశం నిర్వహించి తీర్మానం చేయించాలని ఆయన కలెక్టర్ కి విజ్ఞప్తి చేశారు.