27-10-2025 01:52:16 AM
పాల్గొన్న కేటీఆర్, హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్
సనత్‌నగర్, అక్టోబర్ 26 (విజయక్రాంతి):- త్వరలోనే మంచి రోజులు రాను న్నాయని మాజీమంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. ఆదివారం సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బన్సీలాల్ పేట డివిజన్ లో గల హమాలీ బస్తీలో మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో బొ డ్రాయి పండుగను బస్తీ వాసులు ఘనంగా నిర్వహించారు.
ఈకార్యక్రమానికి మాజీమంత్రి మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. బొడ్రా యి పండుగకు వచ్చిన కేటీఆర్, హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లకు హమాలీ బస్తీ వాసులు, బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు బాణసంచా కాల్చి డప్పు చప్పుళ్ళు, పోతురాజుల నృత్యాలు, బోనాలతో ఘన స్వాగతం పలికారు.
అనంతరం బొడ్రాయికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ పల్లెటూర్లలో మాత్ర మే నిర్వహించే బొడ్రాయి పండుగను హమాలీ బస్తీ లో ఘనంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలు అంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఒక్క సనత్ నగర్ నియోజకవర్గం లోనే కాకుండా హైదరాబాద్‌లో ఎక్కడ ఎవరికి ఏ కష్టం వచ్చినా అండగా నిలిచే గొప్ప నాయకుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్, పద్మారావు నగర్ ఇంచార్జి గుర్రం పవన్ కుమార్ గౌడ్, కార్పొరేటర్ లు హేమలత, టి.మహేశ్వరి, సునీత, బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు వెంకటేషన్ రాజు, కొలన్ బాల్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, నియోజకవర్గ పరిధిలోని వివిధ డివిజన్ లకు చెందిన పలువురు నాయకులు, బస్తీవాసులు సత్యనారాయణ, సుభాష్, యాదగిరి, రవి, కుషాల్, వెంకటేష్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.