27-10-2025 01:49:38 AM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పట్టివేత
-సూట్‌కేస్‌లో 4.15 కిలోల పోనిక్స్ గంజాయి
-బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికురాలి అరెస్ట్
రాజేంద్రనగర్, అక్టోబర్ 26: శంషాబాద్ విమానాశ్రయంలో ఆదివారం భారీగా డ్రగ్స్ పట్టుబడింది. మొత్తం 4.15 కిలోల హైడ్రో పోనిక్స్ గంజాయిని పట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు. దాని విలువ రూ.4.15 కోట్లు ఉంటుందని డీఆర్‌ఐ అధికారులు తెలిపారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికురాలి నుంచి స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
ప్రత్యేకంగా తయారు చేసిన సూట్‌కేస్ రహస్య పొరలో డ్రగ్స్ ప్యాకెట్లు లభ్యమైనట్లు తెలిపారు. అనుమానాస్పదంగా కనిపించిన ప్రయాణికురాలిని అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా బ్యాగులో ముద్ర రూపంలో ఉన్న హైడ్రోపోనిక్ గంజాయి ప్యాకెట్లను అధికారులు గుర్తించారు. దీంతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపడుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.