27-10-2025 01:53:31 AM
బీఆర్‌ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ
కుత్బుల్లాపూర్, అక్టోబర్ 26(విజయక్రాంతి): ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ పేర్కొన్నారు.కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ శంభీపూర్ కార్యాలయంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణని నియోజకవర్గానికి చెందిన ప్రజలు, కాలనీ సభ్యులు, నాయకులు కలిశారు.
ఈ సందర్భంగా కాలనీలో సమస్యలు పరిష్కరిం చాలని కోరారు.అనంతరం క్రిష్ణ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. మేడ్చల్ జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే కె.పి వివేకానంద్ ల దృష్టికి తీసుకెళ్లి వారి సహాయ సహకారాలతో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.