శరీర దానం ఒక సామాజిక స్ఫూర్తి
18-10-2025 05:20 PM
రమేష్..
సూర్యాపేట (విజయక్రాంతి): మరణానంతరం శరీర దానం చేయడం ద్వారా భావితరాలకు ఉపయోగపడే వైద్య విద్యార్థుల పరిశోధనా నిమిత్తం మానవాళికి అందించే అద్భుత సామాజిక స్ఫూర్తి కార్యక్రమము అని సూర్యాపేట స్పందన అవయవ దాన సంస్థ అధ్యక్షుడు గుండా రమేష్ అన్నారు. శనివారం శ్రీ వెంకటేశ్వర కాలనీకి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు, ధ్యాన మండలి సభ్యుడు పులుసు వెంకటయ్య, స్వరాజ్యం దంపతులు శరీర దానా అంగీకార పత్రాన్ని సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు జి రమేష్, మిట్ట కోల కోటయ్య లకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శరీర దాతలుగా ముందుకు వచ్చిన వెంకటయ్య దంపతుల విశాల దృక్పథాన్ని అభినందించారు. వీరిని ఆదర్శంగా తీసుకొని మరింత మంది దాతలు ముందుకు రావాలన్నారు.




