27 February, 2026 | 5:47 AM

ములకలపల్లిలో బంద్ సంపూర్ణం

18-10-2025 05:22 PM

ములకలపల్లి (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం నిర్వహించిన బంద్ ములకలపల్లి మండలంలో విజయవంతమైంది. మండలంలోని పాఠశాలలు, కళాశాలల్లో వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తరగతులను బహిష్కరించారు. వ్యాపార దుకాణాలు, హోటల్స్, బ్యాంకులు వివిధ వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి. ములకలపల్లిలో జరిగిన బంద్ లో అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలనేది కాంగ్రెస్ సంకల్పమన్నారు.

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ ఇటీవల జీవో విడుదల చేయడం జరిగిందన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ అమలుపై కట్టుబడి ఉందన్నారు. ఈ బంద్ కార్యక్రమంలో కాంగ్రెస్ నుంచి తాండ్ర ప్రభాకర్ రావు, కరుటూరి కృష్ణ, ఎండి అంజుమ్, కొండ్రు భాస్కర్, సురభి రాజేష్, సుమిత్, నాగరాజు, సంపత్, పద్మశ్రీ, జయసుధ, సిపిఐ నుంచి ఎండి యూసుఫ్, నరాటి రమేష్, సిపిఎం నుంచి ముదిగొండ రాంబాబు, ఊకంటి రవి, నిమ్మల మధు, మాస్ లైన్ పార్టీ నుంచి పోతుగంటి లక్ష్మణ్,కొర్స రామకృష్ణ, టిడిపి నుంచి బిక్కుమల్ల సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.