24 May, 2026 | 10:58 AM

అల్లుడి మరణం తట్టుకోలేక అత్త మృతి

17-06-2024 12:06 PM

చేగుంట: మెదక్ జిల్లా చేగుంట మండలం మక్కరాజుపేటలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. అల్లుడి మరణం తట్టుకోలేక రోదిస్తూ గుండెపోటుతో అత్త మృతి చెందింది. అనారోగ్యంతో నిన్న ఉపాధి హామీ క్షేత్ర సహాయకుడు నర్సింలు (53) మృతిచెందాడు. రాత్రంతా ఏడుస్తూ గుండెపోటుతో అత్త నర్సవ్వ(68) మృతిచెందింది. ఈ ఘటనతో వారి కుటుంబం మరిత విషాదంలో మునిగిపోయింది. కుటుంబ సభ్యులు కన్నీరుము న్నీర వుతున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకన్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు.