03-12-2025 07:56:28 PM
శామీర్ పేట్: శామీర్ పేట్ పెద్ద చెరువులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం బుధవారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తూముకుంట మున్సిపాలిటీ శామీర్ పేట్ పెద్ద చెరువు కుడి కాలువలో గుర్తు తెలియని మృతదేహం నీటిపై తేలియాడుతూ స్థానికులకు కనిపించింది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకున్న శామీర్ పేట్ పోలీసులు వివరాల కోసం ప్రయత్నించగా ఎలాంటి ఆనవాలు కనిపించలేదు. మృతుని కుడి చేతి భుజంపై పుట్టుమచ్చ(టాటో) ఉందని ఎవరికైనా వివరాలు తెలిస్తే శామీర్ పేట్ పోలీసులను సంప్రదించాలని కోరారు. పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కు మృతదేహాన్ని తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టామని తెలిపారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.