calender_icon.png 3 December, 2025 | 8:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూడో విడత నామినేషన్ల ప్రారంభం..

03-12-2025 07:59:29 PM

సర్పంచ్‌కు 42, వార్డులకు 51 దాఖలు..

కుభీర్ (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌లో భాగంగా కుభీర్ మండలంలో మూడో విడత నామినేషన్ల మొదటి రోజుగా ఈ రోజు నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు, అనుచరులు, రాజకీయ నాయకులు భారీగా హాజరై రాజకీయ ఉత్సాహాన్ని మరింత పెంచారు. ఈ క్రమంలో ఇప్పటివరకు సర్పంచ్ పదవికి 42 నామినేషన్లు, వార్డు సభ్యుల పదవులకు 51 నామినేషన్లు స్వీకరించినట్లు అధికారులు తెలిపారు. నామినేషన్ కేంద్రం వద్ద ఉదయం నుంచే అభ్యర్థుల రద్దీ కనిపించగా, మద్దతుదారులు ర్యాలీలు, నినాదాలతో సందడి చేశారు. ఇక వచ్చే రోజుల్లో నామినేషన్ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఎన్నికల నిర్వాహకులు భావిస్తున్నారు. నామినేషన్ పరిశీలన, ఉపసంహరణ అనంతరం తుది పోటీ స్పష్టమవుతుందని అధికారులు పేర్కొన్నారు. గ్రామాల్లో ఎన్నికల వేడి మొదలై, అభ్యర్థుల ప్రచారం కూడా వేగవంతమవుతోంది.