ఫూలే జీవితం అందరికీ మార్గదర్శకం
బీజేపీ సీనియర్ నేత సంగిశెట్టి రవీంద్ర సాగర్
కుషాయిగూడ ఏప్రిల్ 11 (విజయక్రాంతి) : మహాత్మా జ్యోతిరావు పూలే జీవితం నేటి తరాలకు మార్గదర్శకం కావాలని బిజెపి మేడ్చల్ జిల్లా సీనియర్ నాయ కులు సంగిచెట్టి రవీంద్ర సాగర్ అన్నారు శనివారం పూలే జయంతిని పురస్కరించుకుని కుషాయిగూడలో పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా బిజెపి మేడ్చల్ జిల్లా కౌన్సిల్ సభ్యుడు సంగిశెట్టి రవీంద్ర సాగర్ ఆధ్వర్యంలో పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సమాజం లో సమానత్వం, విద్యాభివృద్ధి కోసం మహా త్మా జ్యోతిరావు పూలే చేసిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు. ఆయన చూపిన మార్గంలో నడుస్తూ సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకుడు ఎనుముల మహే ష్, సీనియర్ నాయకులు కే ఆంజనేయులు, రాజేష్ పటేల్, శ్రీకాంత్ రెడ్డి, ఎల్లేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.




