calender_icon.png 23 December, 2025 | 11:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీటి కుంటలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం

23-12-2025 09:50:35 PM

ఘట్ కేసర్,(విజయక్రాంతి): నీటి కుంటలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండాపూర్ లో కూలర్ కంపెనీ పక్కన గల నింగిశెట్టి కుంట నందు ఒక మగ వ్యక్తి కుంటలో చనిపోయి వెల్లకిలా షర్ట్ లేకుండా ఉన్నాడని సమాచారం వచ్చినట్లు తెలిపారు. మృతుడి  వయస్సు  30 నుండి 35  సంవత్సరాలు ఉంటుందన్నారు. శరీరంపై నలుపు రంగు ప్యాన్ టు ధరించి గడ్డంతో ఉన్నాడని, ఒడ్డు పక్కన బ్లాక్ షూ పారగాన్ కంపెనీ చెందినవి, అలాగే వైట్ షర్ట్ ఉన్నది ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.