23-12-2025 09:43:39 PM
మేడిపల్లి,(విజయక్రాంతి): భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి అనుగ్రహ కరుణాకటాక్షాలతో స్వామివారి జయంతి ఉత్సవాలు దేశవ్యాప్తంగా జరుగుతున్న, సత్యసాయి రథయాత్రలో భాగంగా మన తెలంగాణ రాష్ట్రానికి విచ్చేసినటువంటి స్వామివారి రథము మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని మేడిపల్లి సమితికి సోమవారం శ్రీ సత్య సాయి ప్రేమ ప్రవాహిని రథాన్ని శివం నుంచి మేడిపల్లికి తీసుకురావడం, మేడిపల్లి ధర్మరాజు ఇంటిదగ్గర రాత్రి స్వామివారి రథం బసచేసి మంగళవారం ఉదయం 5 గంటల 20 నిమిషాలకు ఓంకార సుప్రభాతం, నగర సంకీర్తన తర్వాత పూజా కార్యక్రమాలు ముగించుకొని స్వామివారి రథం శంకర్ నగర్ విహారిక ఎంక్లేవ్, తదితర కాలనీలలో ఊరేగింపుగా కమలానగర్ లోని గణేష్ మండపం వరకు చేరుకోగానే స్వామివారికి నైవేద్యం హారతులు సమర్పించి నారాయణ సేవ కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భక్తులు కార్యకర్తలు అత్యంత భక్తి శ్రద్ధలతో,బాలవికాస్ పిల్లలు కూడా వివిధ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. గంగిరెద్దులు, హారతులు తదితర సాంప్రదాయక కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి శ్రీ సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు సోమ సుందరం, పుట్టపర్తి సేవా కార్యక్రమాల ఇంచార్జ్ యాదగిరి రావు, శ్రీ సత్య సాయి సేవ సమితి మేడిపల్లి కన్వీనర్ నరసింహారావు, మహిళా కోఆర్డినేటర్ లక్ష్మీ ,ఆధ్యాత్మిక సమన్వయకర్త మోహన్ రెడ్డి,సర్వీస్ కోఆర్డినేటర్ పవన్ కుమార్,యూత్ కోఆర్డినేటర్ సంతోష్ కుమార్ పట్నాయక్, ధర్మరాజు,అంజిరెడ్డి, బాలవికాస్ ఇన్చార్జీలు, పిల్లలు,వాలంటీర్లు కార్యకర్తలు, భక్తులు పాల్గొని దిగ్విజయం చేశారు.