23-12-2025 10:00:55 PM
హనుమకొండ,(విజయక్రాంతి): ఓబిసి మహిళా విభాగం హనుమకొండ ఆధ్వర్యంలో ఉచిత డ్రైవింగ్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఓబీసీ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉత్సాహవంతులైన బీసీ మహిళలకు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలలో ఉద్యోగ అవకాశాలను పొందుటకు తగిన నైపుణ్య శిక్షణలో భాగంగా డ్రైవింగ్ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహిళలు తమ తల్లిదండ్రుల సమ్మతితో ఒక నిర్ణీత ఫార్మాట్ లో అప్లికేషన్ నింపి రాంనగర్ లో ఓబీసీ కార్యాలయంలో అందజేయాలన్నారు.
ఓబీసీ సంస్థ నిర్వహిస్తున్న వివిధ సామాజిక సేవ కార్యక్రమాలతో పాటు ముఖ్యంగా బీసీ బాలికల వసతి గృహంలో నిర్వహించిన ఆరోగ్య శిబిరాలను విజయవంతం చేసిన మాదిరిగానే ఉచిత మహిళా కారు పైలెట్ (డ్రైవింగ్ శిక్షణ) కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి సహకరించాలని కోరారు. అనంతరం డ్రైవింగ్ శిక్షణ కు సంబందించిన పోస్టర్ ను మహిళా నేతలతో కలిసి ఆవిష్కరించారు.