23-12-2025 09:57:40 PM
ఘట్ కేసర్,(విజయక్రాంతి): మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రెష్ యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు మంగళవారం జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరిని కలిశారు. జిహెచ్ఎంసి ఎల్బీనగర్ జోన్ ఘట్ కేసర్ సర్కిల్ పరిధిలో నూతనంగా విలీనం అయిన గ్రామాలల్లో ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద దాదాపు 524 మంది దరఖాస్తు చేసుకోగ వారికీ మంజూరు కాలేదని తెలిపారు. దీంతో కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ దరఖాస్తులు క్షుణంగా పరిశీలన చేసి అర్హులైన వారికి తప్పకుండ ఇందిరమ్మ ఇండ్ల పథకం వచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కలెక్టర్ ను కలిసిన వారిలో ఘట్ కేసర్ మున్సిపల్ మాజీ చైర్మన్ ముల్లి పావని జంగయ్యయాదవ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ చిలుకూరి మచ్చందర్ రెడ్డి, కీసర దేవస్థానం డైరెక్టర్ అమర్, డీసీసీ కార్యదర్శి ఉల్లి ఆంజనేయులు యాదవ్, సీనియర్ నాయకులు కవాడి మాధవ రెడ్డి, మాజీ కౌన్సిలర్ కడపొల్ల మల్లేష్ , మాజీ డైరెక్టర్ ఉదయ్ రెడ్డి, విశ్వనాద్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు బొక్క సత్తిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.