calender_icon.png 23 December, 2025 | 11:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రైస్తవుల సంక్షేమానికి కట్టుబడి ఉంటా: ఎమ్మెల్యే మేఘారెడ్డి

23-12-2025 10:13:30 PM

వనపర్తి క్రైమ్: క్రైస్తవుల సంక్షేమ అభివృద్ధికి తాను ఎప్పుడు కట్టుబడి ఉంటారని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి  పేర్కొన్నారు. మంగళవారం వనపర్తి పట్టణంలోని దాచా లక్ష్మయ్య ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్ క్రైస్తవుల అభివృద్ధి కోసం పాటుపడి ఉందని అందులో భాగంగానే క్రిస్మస్ వేడుకలు నిర్వహించడానికి రూ.రెండు లక్షలను కేటాయించిందన్నారు. క్షేత్రస్థాయిలోని చర్చలకు సైతం 30 వేల రూపాయలు మంజూరు చేసిందని నిర్వాహకులు అందుకు సంబంధించిన నిబంధనను పాటిస్తూ వాటిని బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకొని తీసుకోవాల్సిందిగా ఆయన సూచించారు.

వనపర్తి నియోజకవర్గ పరిధిలో ఉన్న చర్చిల అభివృద్ధికి తాను సహకారం అందిస్తానని నిర్వాహకులు అందరూ చర్చిల బాగు కోసం కావలసిన పనుల నివేదికను తయారు చేసేవల్సిందిగా ఆయన వారికి సూచించారు.  రెండు ఎకరాల్లో క్రైస్తవ సంఘ భవన నిర్మాణం కోసం గ్రేవ్ యార్డ్ కోసం తాను ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఏర్పాటు చేయిస్తారని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో  ఆర్డివో సుబ్రహ్మణ్యం జిల్లా అధికారి అఫ్జలుద్దిన్, ఉప కలెక్టర్ శ్రావ్య, వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, క్రైస్తవ సోదరులు బెంజిమెన్, జానప్ప జాన్, రాజు, గోర్లు అనిల్ గంధం బాలరాజు వేణు శ్రీకాంత్ తిమోతి తదితరులు పాల్గొన్నారు.