calender_icon.png 23 December, 2025 | 11:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాలికలు విద్యతోపాటు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి: జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే

23-12-2025 10:18:07 PM

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): కౌమార దశలోని విద్యార్థినిలు చదువుతోపాటు ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాధవత్ సంతోష్, స్థానిక ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డిలు అన్నారు. మంగళవారం తాడూర్ కేజీబీవీ విద్యార్థినులకు అమెరికన్ తెలుగు అసోసియేషన్, మానవతా ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం పర్యావరణ హిత శానిటరీ కప్స్ పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డిలచే ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాలికలు చదువుతోపాటు ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. రుతుచక్రం సమయంలో పరిశుభ్రత పాటించడం ఎంతో ముఖ్యమని, ఇలాంటి అవగాహన కార్యక్రమాలు బాలికలకు ఉపయోగపడతాయని తెలిపారు. వారితోపాటు అమెరికా తెలుగు అసోసియేషన్ అధ్యక్షులు జయంత్ చెల్లా, డీఈవో రమేష్ కుమార్ తదితరులు ఉన్నారు.