23-12-2025 10:04:58 PM
సిద్దిపేట: సురక్ష బీమా యోజన పథకం కింద ఏడాదికి రూ.20 చెల్లిస్తే రూ.2లక్షల ప్రమాద బీమా వస్తుందని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ పుల్లూరు మేనేజర్ ప్రదీప్ చెప్పారు. జీవనజ్యోతి బీమా యోజన పథకం కింద ఏడాదికి రూ.436చెల్లిస్తే జీవితబీమా రూ.2లక్షలు వర్తిస్తుందని తెలిపారు. రూరల్ మండలం పుల్లూరు గ్రామంలోని బస్టాండ్‌లో జాగృతి ఫౌండేషన్ విజయవాడ ఉమాశంకర్ కళాజాత బృంద సభ్యులు ఆర్థిక, డిజిటల్ అక్షరాస్యతపై రైతులు, విద్యార్థులు, మహిళా సంఘాలు, వ్యాపార సంస్థల వ్యవస్థాపకులు, సీనియర్ సిటిజన్స్‌కు మంగళవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బ్యాంకు మేనేజర్ ప్రదీప్ మాట్లాడుతూ... జన్‌దన్ ఖాతా ద్వారా జీరో అకౌంట్ ఉచితంగా ఇస్తామన్నారు. విద్యార్థులకు ఎడ్యుకేషన్ లోన్లు, కార్లు, బైకులు, అగ్రికల్చర్ రుణాలను తక్కువ సమయంలోనే పూర్తి చేస్తామన్నారు. సైబర్ మోసాలు అరికట్టే విధంగా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు.