19 April, 2026 | 1:22 PM

మంథని మండలంలో గుర్తు తెలియని మహిళ మృతదేహం

26-04-2025 09:08 AM

మహిళ వివరాలు తెలిసిన వాళ్ళు పోలీసులు కు సమాచారం ఇవ్వాలి 

మంథని ఎస్ఐ డేగ రమేష్

మంథని, (విజయక్రాంతి): మండలంలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం అయిందని ఎస్ఐ రమేష్(SI Ramesh) శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ గుర్తు తెలియని మహిళ మృతదేహం మంథని మండలంలోని గుమ్మనూరు పరిధిలోని మహబూబ్ పల్లి శివారులో ఉందని.  ఆ మహిళ వివరాలు తెలిసిన వాళ్ళు మంథని పోలీసులకు సమాచారం ఇవ్వాలని మంథని ఎస్ఐ డేగ రమేష్ తెలిపారు. మృతి చెందిన మహిళ యాదవ కులానికి చెందిన మహిళగా గుర్తించామని ఎస్ఐ తెలిపారు.