04-12-2025 06:47:02 PM
అడ్డాకుల: మండల గ్రామ పంచాయతీ సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బొక్కలపల్లి దశరథ రెడ్డి భారీ ర్యాలీతో వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా భారీ ర్యాలీగా ఏర్పాటు చేసిన ప్రదర్శన ఎన్నికలు గ్రామ వాతావరణాన్ని మరింత సందడిగా మార్చాయి. ఈ సందర్బంగా దశరథ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి మహిళల కోసం పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు అవుతున్నాయన్నారు.
దేవరకద్ర నియోజకవర్గం ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అండదండలతో పోటీ చేస్తున్నాని తెలిపారు. గ్రామ ప్రజల ఆశీర్వాదంతో భారీ మెజార్టీతో గెలుస్తానని నమ్మకంగా ఉన్నాను అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అభ్యర్థిని అభినందించారు. అనంతరం ర్యాలీ రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకుని నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో విజయ మోహన్ రెడ్డి, శేఖర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వేగ నాథ్, హనుమంతు, అంజన్న, తదురులు పాల్గొన్నారు.