calender_icon.png 4 December, 2025 | 7:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దిల్లీ చేరుకున్న పుతిన్.. మోదీ ఘనస్వాగతం

04-12-2025 07:23:46 PM

న్యూఢిల్లీ: రెండు రోజుల పర్యటనలో భాగంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Russian President Vladimir Putin) భారత్ కు చేరుకున్నారు. ఆయనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(Prime Minister Narendra Modi) పాలం విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. పుతిన్ గౌరవార్థం ఈరోజు రాత్రికి ప్రధాని మోదీ విందు ఇవ్వనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి భవన్ లో పుతిన్ కు అధికారిక స్వాగతం ఉండనుంది. అలాగే 23వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ పాల్గొననున్నారు. అనంతరం సమావేశంలో ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. భారత్-రష్యా మధ్య అణు విద్యుత్ సహా పలు రంగాల్లో కీలక ఒప్పందాలు జరుగనున్నాయి.