04-12-2025 06:58:04 PM
అడ్డాకుల: మండల గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బిఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి తిరుపతిరెడ్డి గురువారం బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ర్యాలీగా వెళ్లి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందించడం జరిగింది. ఈ సందర్భంగా తిరుపతిరెడ్డి మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి పార్టీతో సంబంధం లేకుండా గ్రామాన్ని అన్నిరంగంలో అగ్ర గ్రామిగా నిలిపేందుకు కృషి చేస్తానని, గ్రామాన్ని ఆదర్శంగా గ్రామం నిలిపేందుకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో జితేందర్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, రమేష్, ఖాజా గోరి, తదిరులు పాల్గొన్నారు.