calender_icon.png 4 December, 2025 | 7:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అపోహలు పోవాలి-అవగాహన పెరగాలి

04-12-2025 06:32:08 PM

స్మైల్ విత్ షేన్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు గ్రేస్..

ఉప్పల్ (విజయక్రాంతి): ఎయిడ్స్ పై అపోహలు మాని అవగాహన పెంచుకోవాలని స్మైల్ విత్ షేన్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు గ్రేస్ అన్నారు. ఈనెల ఒకటో తారీకు నుండి ఆరో తారీకు వరకు స్మైల్ విత్ షేన్ వారు నిర్వహిస్తున్న హెచ్ఐవి అవగాహన సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హెచ్ఐవిపై అపోహలు మానుకోవాలని అవగాహన పెంచుకునేందుకే ప్రపంచ ఎయిడ్స్ డే ముఖ్య ఉద్దేశం అన్నారు. ఈనెల ఆరో తేదీన నాచారం దుర్గానగర్ లో తమ స్వచ్ఛంద సంస్థ ద్వారా హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకు కిరాణా సామానుతో పాటు దుప్పట్లు స్వెటర్లు చీరలు పంపిణీ చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. హెచ్ఐవి వ్యాధిగ్రస్తులు కార్యక్రమంలో పాల్గొనాలని ఆమె కోరారు.