04-12-2025 07:01:50 PM
గ్రామంలో వెల్లివిరిసిన అధ్యాత్మిక వాతావరణం..
బేల (విజయక్రాంతి): ప్రతి ఏటా బ్రహ్మాలిన్ సద్గురు బాజీరావ్ బాబాను స్మరిస్తూ నిర్వహించే సప్తాహ కార్యక్రమం బేలా మండలంలోని మనియార్ పూర్ గ్రామంలో గురువారం ఘనంగా నిర్వహించారు. గత వారం రోజులుగా కొనసాగుతున్న ఈ కార్యక్రమంలో ప్రతి నిత్యం ప్రభాత బేరి, ధ్యాన కీర్తన, ప్రవచనలతో పాటు సాంస్కృతిక, అధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగుతూ వస్తున్నాయి. ముగింపు సందర్భంగా జ్ఞనేశ్వర్, నివృత్తి, సోపాన్, ముక్తబాయి వేశాదారనాలో ఉన్న చిన్నారులను రథం పైనా ఉంచి గ్రామంలో శోభయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామస్తులు రథానికి పూజలు చేశారు. వివిధ గ్రామాల నుండి వచ్చిన భజన బృందాలు ఆలపించిన భక్తి గీతాలు, బాబా నామస్మరణతో గ్రామ వీధులన్నీ మారుమోగాయి. అనంతరం దహహండి కాళ, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.