calender_icon.png 4 December, 2025 | 7:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అడ్డాకుల స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థిగా ఎండి ఖాజా మైనుద్దీన్

04-12-2025 06:59:40 PM

అడ్డాకుల: అడ్డాకుల మండల గ్రామ స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థిగా ఎండి ఖాజా మైనోద్దీన్ గురువారం నామినేషన్ ను పెద్దలు, యువకులు సమక్షంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు. అంతకుముందు పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి వివేకానంద విగ్రహానికి, గాంధీ విగ్రహానికి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రతి సమస్య ను పరిష్కారం దిశగా పనిచేస్తానని అందరికి అందుబాటులో ఉంటానన్నారు. ఒక యువకుడిగా అవకాశం ఇస్తే అందరికీ సేవ చేసి అడ్డాకుల అందరికీ అభివృద్ధిలో ఆదర్శంగా చేస్తాను మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదం, ముజీబ్, నజీర్, సుదర్శన్, మధు, యువకులు గ్రామస్తులు పాల్గొన్నారు.