calender_icon.png 4 December, 2025 | 7:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కమిషనర్ కు అభినందనలు తెలిపిన మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు

04-12-2025 06:56:48 PM

కరీంనగర్ (విజయక్రాంతి): మున్సిపల్ కార్మికులకు 30 లక్షల ఇన్సురెన్స్ కు శ్రీకారం చుట్టడంతో పాటు కార్మికులకు ఇవ్వవలసిన సబ్బులు, కొబ్బరినూనె, షూలు, ఇచ్చినందుకు కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, మునిసిపల్ ఎంహెచ్ఓ సుమన్ లను తెలంగాణ మునిసిపల్ వర్కర్స్ & ఎంప్లాయిస్ యూనియన్-సీఐటీయూ కరీంనగర్ కార్పొరేషన్ కమిటీ ఆధ్వర్యంలో అభినందించారు. అలాగే  కార్మికులకు ఇవ్వవలసిన బట్టలు, డ్రెస్ బట్ట, చీరలు, టవల్స్, స్వేట్టర్స్ఇవ్వాలని కోరగా, వారధి సెక్రటరీతో మాట్లాడమని కమిషనర్  తెలిపారని, ఇతర అంశాలను కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనగాం రాజమల్లు, జిల్లా అధ్యక్షుడు కవ్వంపెల్లి రవి, మహిళ  కమిటి కన్వీనర్ ముక్కెర బుజ్జమ్మ, జిల్లా కోశాధికారి దాసరి రాజమల్లయ్య, కార్పొరేషన్ కమిటీ ప్రధాన కార్యదర్శి దేవునూరి శ్యామ్ సుందర్, డ్రైవర్స్ కమిటీ నాయకులు జంగం రవీందర్, జోగు గాంగయ్య, చంద్రకళ, కూర రాజు, బెజ్జంకి స్వామి, రాజు, తదితరులు పాల్గొన్నారు.