calender_icon.png 29 June, 2025 | 1:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాలీవుడ్ నటి షఫాలీ జరివాలా హఠాన్మరణం

29-06-2025 01:56:39 AM

‘కాంటా లగా’ పాటతో దేశవ్యాప్తంగా పాపులర్

ముంబై, జూన్ 28: బాలీవుడ్ నటి షెఫాలీ జరీవాలా (42) హఠాన్మరణం చెందడం సంచలనం రేపిం ది. శుక్రవారం రాత్రి ఆమె గుండెపోటుకు గురయ్యారని తెలుస్తోంది. 2002 నాటి ‘కాంటా లగా’ పాటతో ఆమె దేశవ్యాప్తంగా పాపులర్ అ య్యారు. గుండెపోటు రావడంతో షెఫాలీని ఆమె భర్త ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. అయితే ఆమె మృతికి గల కారణాలను కు టుంబసభ్యులు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

‘కాంటా లగా’ పాట తో ఓవర్‌నైట్ స్టార్ అయిన షెఫాలీ ఆ తర్వాత సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ నటించిన ముఝ్ సే షాదీ కరోగీ (2004) సినిమాలో నటించా రు. హిందీ రియాల్టీ షో బిగ్‌బాస్ 13 లోనూ ఆమె పాల్గొన్నారు. 2015లో సహ నటుడు పరాగ్ త్యాగీని వివాహమాడారు. కాగా షెఫాలీ జరీవా లా అంత్యక్రియలను భర్త పరాగ్ త్యా గి, కుటుంబ సభ్యుల సమక్షంలో ముంబైలోని ఓషివారా హిందూ శ్మశానవాటికలో  నిర్వహించారు.