18 July, 2026 | 6:52 PM

Breaking News

నాణ్యమైన విద్యకు కేరాఫ్ ప్రభుత్వ పాఠశాలలు   •   పరిసరాల సేవా వీరులు   •   మిర్యాల కాంగ్రెస్ కార్యకర్త మెంచు లింగమల్లు దశదిన కర్మకు ఆర్థిక సహాయం   •   ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో పాత్రికేయుల పాత్ర అంత్యంత కీలకం   •   విద్యార్థులలో క్రమశిక్షణ, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సహకారంతో విద్యాభివృద్ధి   •   'ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన'ను తక్షణమే అమలు చేయాలి   •   గ్రామాల అభివృద్ధికి కట్టుబడి పని చేస్తున్నాం: ఎమ్మెల్యే జారె, ఎంపీ రఘురామిరెడ్డి   •   తల్లిదండ్రుల సహకారంతోనే పాఠశాలల అభివృద్ధి   •   అర్హులైన ఓటర్లను జాబితాలో చేర్చాలి   •   ఎల్నీనో ప్రభావం గురించి రైతులకు అవగాహన కల్పించిన ఏవో   •  

మానుకోటలో బాంబు స్క్వాడ్ తనిఖీలు

29-05-2026 02:31 AM

మహబూబాబాద్, మే 28 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ఆదేశాల మేరకు బక్రీద్ పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా మహబూబాబాద్ పట్టణంలో బాంబు, డాగ్ స్క్వాడ్ బృందాలతో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

మహబూబాబాద్ టౌన్ సీఐ ఎల్.రఘుపతి రెడ్డి, జీ. ఉమ ఆధ్వర్యంలో ఈద్గా, దర్గాలు, పట్టణంలోని ప్రధాన కూడళ్లు, రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, నెహ్రూ సెంటర్, తొర్రూరు బస్ స్టాండ్ సెంటర్ తదితర ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.ఈ తనిఖీలలో అంజయ్య, అశోక్, మురళి (డాగ్ హ్యాండ్లర్), ఆర్పీఎఫ్ సిబ్బంది ఆర్. సార్య, కె. నాగిరెడ్డి, డాగ్ హ్యాండ్లర్ ఎల్. సునీల్ తదితరులు పాల్గొన్నారు.