18 July, 2026 | 6:26 PM

Breaking News

తల్లిదండ్రుల సహకారంతోనే పాఠశాలల అభివృద్ధి   •   అర్హులైన ఓటర్లను జాబితాలో చేర్చాలి   •   ఎల్నీనో ప్రభావం గురించి రైతులకు అవగాహన కల్పించిన ఏవో   •   ఎస్ఐఆర్ శిబిరాన్ని సందర్శించిన శ్రావణి రాకేష్   •   పోలీసులకు ప్రజా దర్బార్   •   మాజీ మంత్రి జగదీష్ రెడ్డి జన్మదిన సందర్భంగా మొక్కలు నాటిన బిఆరెస్వి నాయకులు.   •   బోనం ఎత్తుకున్న విద్యార్థులు వైభవంగా బోనాల పండుగ వేడుకలు   •   విద్యార్థుల భవిష్యత్తుకు తల్లిదండ్రుల ప్రోత్సాహం చాలా అవసరం   •   వ్యవసాయంపై దిశానిర్దేశం   •   మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి జన్మదిన సందర్బంగా క్యాన్సర్ పెషేంట్ కి ఆర్థిక సహాయం   •  

ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలం

29-05-2026 02:33 AM

మాజీ ఎమ్మెల్యే గండ్ర 

జయశంకర్ భూపాలపల్లి (మహబూబాబాద్) మే 28 (విజయక్రాంతి): ధాన్యం కొనుగోలు, తరలింపులో రాష్ట్ర ప్రభుత్వం పూ ర్తిగా విఫలమైందని.. రైతు గోస, బీజేపీ భరోసా పేరుతో ప్రచార యాత్ర నిర్వహించడం మినహా రైతులకు ఒరిగింది ఏమీ లేదని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆరోపించారు.

గురువారం జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో గండ్ర మాట్లాడుతూ.. సీఎం సొంత నియోజకవర్గంలోనే రైతులు రోడ్డెక్కి నిరసన తెలిపే పరిస్థితి నెలకొంది అంటే రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందనడానికి అద్దం పడుతుందన్నారు.

వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెపుతున్నప్పటికి ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచకుండా, రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సరికాదని మండిపడ్డారు. ధాన్యం తడిచే పరిస్థితి ఏర్పడితే తడిచిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, తగు జాగ్రత్తలు పాటించాలని కోరారు. పంట వ్యర్ధాలను కాల్చవద్దని రైతులను కోరారు.