18 July, 2026 | 7:19 PM

Breaking News

బూర్గంపాడు ఆసుపత్రి సేవలు భేష్   •   మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రభుత్వం కృషి   •   ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా విద్యా బోధన జరగాలి   •   నాణ్యమైన విద్యకు కేరాఫ్ ప్రభుత్వ పాఠశాలలు   •   పరిసరాల సేవా వీరులు   •   మిర్యాల కాంగ్రెస్ కార్యకర్త మెంచు లింగమల్లు దశదిన కర్మకు ఆర్థిక సహాయం   •   ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో పాత్రికేయుల పాత్ర అంత్యంత కీలకం   •   విద్యార్థులలో క్రమశిక్షణ, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సహకారంతో విద్యాభివృద్ధి   •   'ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన'ను తక్షణమే అమలు చేయాలి   •   గ్రామాల అభివృద్ధికి కట్టుబడి పని చేస్తున్నాం: ఎమ్మెల్యే జారె, ఎంపీ రఘురామిరెడ్డి   •  

కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి

29-05-2026 02:30 AM

మహబూబాబాద్, మే 28 (విజయక్రాంతి): కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో హామాలి కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆల్ హామాలి కార్మిక సంఘం మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి కుమ్మరి కుంట్ల నాగన్న డిమాండ్ చేశారు. కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం ఈనెల 30న జనగామలో నాల్గవ రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

మహాసభలను విజయవంతం చేయడానికి జిల్లా కేంద్రంలో వివిధ కార్మికుల అడ్డాల వద్ద ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ హమాలీలకు ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటుచేసి గుర్తింపు కార్డులు ఇవ్వాలని, పిఎఫ్, ఈఎస్‌ఐ, ప్రమాద బీమా, పెన్షన్, పిల్లల భవిష్యత్తు పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. 

ఈ కార్యక్రమంలో బత్తుల వెంకన్న, హేమ, లక్ష్మణ్, లాలు, కాంతి, బాలు, మన్ని, జ్యోతి, రాజేష్, హరి, సేవ్య, నవీన్, రాజు, రాము, మోహన్, ప్రసాద్, రంగన్న, మహేందర్, మల్లేష్, శ్రీను, రవి, ఐలయ్య, సారయ్య, బిచ్చ వెంకటనారాయణ, సాగర్, గణేష్, శ్రీరామ్, నరేష్, వినోద్, శ్రీనివాస్, చందు, లింగం, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.