17 April, 2026 | 2:50 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

బేగంపేట విమనాశ్రయానికి బాంబు బెదిరింపు

19-06-2025 12:49 AM

-మెయిల్ పంపి కలకలం సృష్టించిన ఆగంతకుడు

హైదరాబాద్ సిటీబ్యూరో జూన్ 18 (విజయక్రాంతి): బేగంపేట విమానాశ్రయంలో బాంబు ఉందని గుర్తు తెలియని వ్యక్తి నుంచి వచ్చిన మెయి ల్ కలకలం సృష్టించగా, అధికారులు అప్రమత్తమై భద్రతను కట్టుది ట్టం చేశారు. బుధవారం ఉదయం 11:10 గంటలకు గుర్తు తెలియని వ్యక్తి నుంచి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. ఎయిర్‌పోర్టులో బాంబు ఉందని ఆగంతకుడు మెయిల్‌లో పేర్కొనడంతో, విమానాశ్రయ సిబ్బం ది అప్ర మత్తమయ్యారు.

ఉన్నతాధికారులకు సమాచారం అందించగా.. వెంటనే తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, సీఐఎస్‌ఎఫ్ బలగాలు రంగంలోకి దిగాయి. విమానాశ్రయం లోప ల, పరిసర ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. స్నిఫర్ డాగ్స్, బాంబ్ డిటెక్షన్ స్క్వాడ్ బృందాలతో కలిసి ప్రతీ అంగుళం పరిశీలించారు. ఎయిర్‌పోర్ట్ సిబ్బంది ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మెయిల్ ఎవరు పంపా రు.. ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయమై ఆరా తీస్తున్నారు. ఐపీ అడ్రస్, ఇతర సాంకేతిక ఆధారాల ద్వారా ఆగంతకుడిని గుర్తించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.