04-12-2025 01:44:42 PM
అహ్మదాబాద్: సౌదీ అరేబియాలోని మదీనా నుండి హైదరాబాద్(Madinah to Hyderabad) వస్తున్న ఇండిగో విమానం గురువారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ (Sardar Vallabhbhai Patel International Airport) విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానానికి బాంబు బెదిరింపు(Bomb threat) సందేశం వచ్చింది. విమానంలో బాంబు తీసుకెళ్తున్నానని ఒక ప్రయాణీకుడు చెప్పాడని, విమానం మధ్యలో పేల్చివేస్తానని బెదిరించాడని తెలిసింది.
ప్రోటోకాల్‌ను అనుసరించి, పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు(Air traffic control) సమాచారం అందించాడు. భద్రతా సంస్థలను వెంటనే అప్రమత్తం చేశారు. ఆ తర్వాత విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ కోసం అహ్మదాబాద్‌కు(Ahmedabad) మళ్లించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, విమానంలో 180 మందికి ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. ల్యాండ్ అయిన వెంటనే ప్రయాణీకులందరినీ సురక్షితంగా తరలించారు. బాంబు గుర్తింపు నిర్వీర్య దళం, పోలీసులు, విమానాశ్రయ భద్రతా బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. విమానాన్ని ఐసోలేషన్ బేకు తరలించారు. అక్కడ విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బెదిరింపులకు పాల్పడిన ప్రయాణీకుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మరోపక్క ఇండిగో విమాన సర్వీసుల్లో తీవ్ర అంతారాయం కలిగింది. దేశవాప్తంగా 180కి పైగా విమానాలను ఇండిగో రద్దు చేసింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.