calender_icon.png 7 June, 2025 | 4:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హమాస్‌పై బాంబుల వర్షం

02-06-2025 02:29:30 AM

టెల్‌అవీన్, జూన్ 1: హమాస్‌పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. హమాస్ టాప్ కమాండర్ మహ్మద్ సిన్వర్‌ను మట్టుబెట్టాలని స్కెచ్చేసిన ఇజ్రాయెల్ కేవలం 30 సెకండ్లలో 50 బాంబులను ప్రయోగించింది. క్షణాల్లో ప్రయోగించిన బాంబుల ధాటికి హమాస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ కూడా ధ్వంసమైంది.

ఓ ఆసుపత్రి కింద ఈ కమాండ్ సెంటర్ ఉందని, కావాలనే హమాస్ ఉద్దేశపూర్వకంగా ఈ సెంటర్‌ను ఏర్పాటు చేసిందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. ఈ ఆపరేషన్ ను ఐడీఎఫ్ బలగాలు, ఇజ్రాయెల్ సెక్యూరిటీ అథారిటీ నిర్వహించాయి.

బాంబుదాడుల వల్ల 31 మంది మృతి చెందగా.. మరో 70 మంది గాయపడినట్టు హమాస్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. హమాస్ అధినేత యాహ్యాసిన్వర్ సోదరుడైన సిన్వర్‌ను మట్టుబెట్టేందుకు దాడులు చేసినట్లు తెలుస్తోంది.